Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 50,000 ఇవ్వాలి

దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 50,000 ఇవ్వాలి

- Advertisement -

 నవతెలంగాణ-వనపర్తి 
మెంథా తుఫాన్ వర్షానికి జిల్లాలో దెబ్బతిన్న వరి పత్తి తదితర పంటలకు ఎకరానికి రూ. 50,000 నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గం కార్యదర్శి జే రమేష్ డిమాండ్ చేశారు. వనపర్తి మండలం నర్సింగాయిపల్లి, గోపాల్పేట మండలం తాడిపర్తి, గోపాల్పేట పోలికేపాడులలో దెబ్బతిన్న పంటలను స్థానిక నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం పోలికపాడులో మాట్లాడారు. వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకు ఒరిగి నీళ్లలో పడ్డాయని, పక్వానికి వచ్చిన ఒడ్లు మొలకెత్తి, పక్వం కాని వడ్లు తాలు పోయి రైతుల నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఎకరానికి రూ. 40 వేల దాకా పెట్టుబడి పెట్టి 6 కాలం పనిచేశారన్నారు. పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం రైతుల ఆశలను చిదిమేసిందన్నారు. రెవెన్యూ వ్యవసాయ అధికారులు గ్రామాలలో పర్యటించి ప్రతి రైతు పంట నష్టాన్ని స్పష్టంగా లెక్కించాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్లో ముందుగా నాటిన చేలు కోస్తున్నారని, కొందరు నూర్పిడులు కూడా చేశారని,కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ధాన్యం ఎక్కడ పోసుకోవాలోఅర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. గోపాల్పేట కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం పోసారని కొనుగోలు ప్రారంభించకపోవడంతో మళ్లీ వర్షానికి తడుస్తుందని ఆందోళన చెందుతున్నారన్నారు. తాడిపర్తి లో కేంద్రం తెరవక రైతులు ఇండ్ల ముందే ధాన్యం పోసుకొని ఆరబెడుతున్నారన్నారు. చాలా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని,పోలికే పాడు కేతేపల్లితో పాటు చాలా గ్రామాల్లో కొనుగోలుకు దాన్యం పోసేందుకు స్థలాలు లేవన్నారు.ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలకు శాశ్వత స్థలాలను కేటాయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా గత రబీలో సేకరించిన సన్నధాన్యానికి క్వింటాల్ రూ. 500 బోనస్ చెల్లించలేదని, వెంటనే చెల్లించాలన్నారు. ఆలస్యంతో ప్రభుత్వం బోనస్ ఎగవేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారన్నారు. ఖరీఫ్లో సేకరించే ధాన్యానికి కనీస మద్దతు డబ్బుతోపాటు, బోనస్ రూ. 500 కూడా కలిపి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుంటే సిపిఐ ఆధ్వర్యంలో బాధితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గోపాల్పేట మండల కార్యదర్శి మంకలి శాంతన్న రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -