నవతెలంగాణ – పెద్దవూర: తుఫాన్, భారీ వర్షాల కారణగా పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరానికి 20 000పరిహారం అందించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుబ్భా రామ చంద్రయ్య, సీఐటీయు జిల్లా నాయకులు ఎస్కె భషీర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని జయరాం తండ లో సిపిఎం పార్టీ పెద్దవూర మండల నాయకుల బృందం ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటపొలాలను సందర్శించి మాట్లాడారు. చేతికొచ్చిన పంట నేలపాల అయిందని మూతి కందే ముద్దా వరదలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యకం చేశారు. అన్నమో రామచంద్ర అనీ దుఃఖిస్తున్న రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత అని రైతే రాజని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు పెండింగ్లో ఉన్న రైతుబంధు బిల్లులు కూడా వేయలేదని అన్నారు. యాసింగి రైతుబంధు కూడా ఇంతవరకు ఇవ్వలేదని,
కష్టపడి పని చేస్తున్న రైతన్నలకు, అర్హులైన రైతులకు నెలకు 6000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు దూరపల్లి మల్లయ్య, దుబ్బ ఏడుకొండలు, రైతులు లక్ష్మ,రాములు, శ్రీరాములు, బిచ్చాలు,లాలు, చందర్, బాలు, లచ్చు, రంగా తదితరులు పాల్గొన్నారు.
పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



