Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు: కలెక్టర్

శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి: సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత, విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రత్యేకించి విద్యార్థినులకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన తర్వాత వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.         శనివారం ఈ విషయంపై సెట్విన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ముందుగా  సెట్విన్ ద్వారా నిర్వహించే కోర్సులు ,వాటికి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలతో జిల్లాలోని అన్ని సంక్షేమ కళాశాలలు, పాఠశాలలు, కేజీబీవీ లలో అవగాహన కల్పించాలని, ఇందుకుగాను ఒక  షెడ్యూల్ రూపొందించాలని, వచ్చేవారం ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ,సెట్విన్ ప్రతినిధి రెనుకను ఆదేశించారు. అలాగే విద్యార్థులతో పాటు, చదువుకున్న నిరుద్యోగ మహిళలలు  మహిళా ప్రాంగణంలో బ్యూటిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ విధమైన శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల అధికారులు ,ఆర్ సి ఓ లు వారి వారి విద్యాసంస్థల్లోని విద్యార్థులు  మధ్యలో బడి  ఎం మానేసిన  వారు ఆయా కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

      అంతకుముందు సెట్విన్ ప్రతినిది రేణుక  మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యం ఉంటే జీవితంలో రాణించడానికి అవకాశం ఉందని, సెట్విన్  ద్వారా సుమారు 30 కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తమ శిక్షణ కాలం కేవలం మూడు నుండి ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, దీని ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిప్లమా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని, ఐదవ తరగతి మొదలుకొని ఇంటర్ ఆపై పాసైన వారందరికీ  నామమాత్రపు ఫీజు తో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులు వారి విద్యను పూర్తి చేసుకున్న వెంటనే ఈ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్ వస్తుందని తద్వారా వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.

ఈ సమావేశానికి  గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిపిఓ వెంకయ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, డిటిడిఓ చత్రు నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ సి ఓ లు  పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -