నవతెలంగాణ – ఆలేరు రూరల్
నలభై ఏళ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని శారాజీపేటలో పదవ తరగతి (1985–86) పూర్వ విద్యార్థులు సైదా బేగం,పాములపర్తి రాంచంద్రా రెడ్డి, దయ్యాల దేవేందర్ తెలిపారు.ఆదివారం ఆలేరు మండలం శారాజీపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది.చాలాకాలం తర్వాత స్నేహితులను కలుసుకోవడంతో చిన్ననాటి మధుర క్షణాలు,ఆనందాలను జ్ఞాపకం చేసుకొన్నారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని,సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు.ఈ సందర్భంగా గురువులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో తమ్మలి ఆశయ్య,కాండ్రా సత్తయ్య, చెన్నోజు శ్రీనివాస్,దోడ కొండయ్య, మద్దెల శ్రీనివాస్,నవనీత,స్వరూప, కళాభాయ్,సయ్యద్ అబ్బాస్,నారాగోని శ్రీనివాస్,యాదిరెడ్డి,జిల్లా మణెమ్మ,దూడల శ్రీనివాస్,చంద్ర ఋషి,బత్తుల కొండల్ రెడ్డి,దూడల జంగయ్య,ఏంపల్లి నీలేందర్ రెడ్డి, సాయిరెడ్డి మల్లారెడ్డి, హేమలత, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



