Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంరీల్స్ మోజు..యువ జంట‌కు తీవ్ర గాయాలు

రీల్స్ మోజు..యువ జంట‌కు తీవ్ర గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రీల్స్ మోజులో పడి స్టంట్స్ చేసిన ఓ జంట బొక్క బోర్లా ప‌డ్డారు. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగిల్ టైర్ తో బైక్ నడుపుతూ హల్ చల్ చేశారు. దీంతో కిందపడి బోన్స్ విరగొట్టుకున్నారు. కింద పడిన అమ్మాయిపై మరో బైక్ దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాత్రి వేళ బైక్‌పై నడి రోడ్డు మీద ఓ జంట బైక్ స్టంట్ చేస్తుంది. వెనుక సీటులో కూర్చున్న యువతి, ముందు హ్యాండిల్ పట్టుకున్న యువకుడు రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తూ స్టంట్ చేశారు. బైక్ ముందు టైర్‌ను పైకి లేపి స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి వాహనం బొక్క బోర్లా పడి పోయింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో బైక్ వీరిపై నుంచి వెళ్లడంతో అది కూడా స్కిడ్ అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -