-తుంగతుర్తి ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ భయగాని రవి ప్రసాద్ గౌడ్
నవతెలంగాణ -తుంగతుర్తి
తుంగతుర్తి గ్రామ పాడిరైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ భయగాని రవి ప్రసాద్ గౌడ్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీకా కార్యక్రమం నేటి నుండి 6వ,తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి గ్రామంలోని పశువులన్నింటికీ అనగా మూడు నెలలు వయసు దాటిన గేదే దూడలు,ఆవు దూడలు పాలిచ్చే,చూడి పశువులన్నింటికీ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.గాలికుంటు వ్యాధి అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ వలన వస్తుందని,ఈ వ్యాధి వచ్చిన పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ,నోటిలో,కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు మేత మేయక,నడవలేక ఇబ్బంది పడి,పాల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు.వ్యవసాయ యోగ్యమైన పశువులు పనిచేయక ఎండ తీవ్రత తట్టుకోలేక ఒగిరిస్తూ, పాడిపశులు ఎదకు రాక,ఎదకు వచ్చినా చూడి నిలవక,పాలిచ్చే పశువుల పాలు త్రాగిన దూడలు మరణించే అవకాశం ఉంటుందని,దీనితో ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని తెలిపారు.కావున ప్రతి పాడి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమకు ఉన్న అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని కోరారు.
పాడి రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



