నవతెలంగాణ-హైదరాబాద్ : ఫేస్‌బుక్ వేదికగా తనను వేధిస్తోన్న యువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నవీన్’ అనే వ్యక్తి నుంచి సీరియల్ నటికి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె తిరస్కరించడంతో అతడు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో నటి అతడిని బ్లాక్ చేశారు. అయినా అతడు ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి వాటినుంచి సందేశాలు పంపుతుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బ్లాక్ చేసినప్పటికీ వేధింపులు ఆగడం లేదని నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడు పంపిన సందేశాల వల్ల మానసిక క్షోభ అనుభవించినట్లు తెలిపారు. దీంతో అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

                                    

