Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక వర్షాలకు రైతన్నలకు తీవ్ర నష్టం రైతులను ఆదుకోవాలి సిపిఎం

అధిక వర్షాలకు రైతన్నలకు తీవ్ర నష్టం రైతులను ఆదుకోవాలి సిపిఎం

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ 
పత్తి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయి. పత్తి తీసే సమయంలో వర్షం రావడంతో చెట్లపైనే వత్తి మొలకెత్తిపోయిందని, వరి పంట చేతికొచ్చి నోటికాడి బుక్కను లాక్కున్నట్టు చేసింది ముంథా తుఫాన్. మక్క పంట పూర్తిగా వర్షాలకు నేలమట్టమైందని రైతులు తెలియజేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మంగళవారం కల్వకుర్తి ఆర్డిఓకు వినతిపత్రం అందజేశారు. మండలాల్లో అగ్రికల్చర్ అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి వరి పంట నష్టపోయిన రైతులకు 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.పత్తి పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాల వల్ల ఎర్రగుమ్మడి తెగులు బారిన పడి ఎకరాలకు ఎకరాలు చేతికి రాకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పత్తి రైతుకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చిలుక బాల్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఏపీ మల్లయ్య, పి పరశురాములు, రైతు సంఘం నాయకుడు కిషోర్ టి చెన్నయ్య పర్వతాలు బీరయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -