- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు.. దక్షిణాఫ్రికా జట్టును ఓడించి క్రీడాభిమానుల్ని ఉత్సాహంలో నింపింది. 1973 తర్వాత ఇంతటి విజయాన్ని సాధించిన మహిళల జట్టును బుధవారం ప్రధాని మోడీ కలవనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో మోడీ గెలిచిన మహిళా జట్టును కలిసి వారిని సత్కరించనున్నట్లు సోమవారం ప్రధాని కార్యాలయం వెల్లడించింది. సోమవారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి అందిన ఆహ్వానం మేరకు మహిళా జట్టు మంగళవారం విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
- Advertisement -



