- Advertisement -
బోనాలతో బారులుదీరిన భక్తులు..
నవతెలంగాణ-వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు వండి బోనాలు తయారుచేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా భక్తులు తరలివచ్చడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. దేవాలయ సూపర్డెంట్ రాజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించారు.
- Advertisement -



