నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కళాశాల ఎన్సిసి క్యాడెట్లు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆటల్లో ముందుండాలి అనే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంలో క్యాడెట్లు అత్యుత్తమ ఉత్సాహం, క్రమశిక్షణ ప్రదర్శించడంతో, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చే ప్రశంసా పత్రాలు అందుకున్నట్టు ఎన్సిసి అధికారి బి బ్రిజేష్ రాజ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. – క్షత్రియ కాలేజ్ ఎన్సిసి క్యాడెట్లు ఎల్లప్పుడూ క్రమశిక్షణ, సేవాభావం, మరియు జాతీయ సమైక్యతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారని, వారు చూపిన క్రమశిక్షణ, సమన్వయం, మరియు ఉత్సాహం వారిలోని నిజమైన ఎన్సిసి ఆత్మను ప్రతిబింబించింది అని తెలిపారు. అవార్డు క్యాడెట్ల కష్టానికి, పట్టుదలకి, విలువలపట్ల నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ , సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ ఏవో శ్రీ బి. నరేందర్ శుభకాంశాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రశంసలందుకున్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సిసి క్యాడెట్లు
- Advertisement -
- Advertisement -



