- ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి: క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులకు ఉంటుందని ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రం సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు పాఠశాలల్లోని ఆరు రూములకు పెయింటింగ్ వేయించారు. వాటర్ ఫిల్టర్ రిపేర్, స్పోర్ట్స్ మెటీరియల్ అందించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 5 బోర్డులు, టేబుల్స్, చైర్స్, రాక్, స్పోర్ట్స్ మెటీరియల్, ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రం సుధాకర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలకు మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా మా ఫౌండేషన్ పని చేస్తుందన్నారు. పరీక్షలు జీవన్మరణ సమస్య కానేకాదని, ఆత్మవిశ్వాసంతో ఇష్టంతో చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చదువుల్లో భవిష్యత్తులో రాణించాలంటే సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు చదువుకున్న పాఠశాలకు, మంచిగా చదువుకొని, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు,పాఠశాలకు సేవలు చేసే వారికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు.
విద్య అనేది విద్యార్థుల కెరీర్‌కు ‘గేట్ వే’ వంటిదన్నారు. కెరీర్ ప్లాన్ చేసుకొని అధ్యాపకులు ఇచ్చే సలహాలు విద్యార్థులు పాటించాలన్నారు. అనంతరం ఇరు పాఠశాలల ఉపాధ్యాయ బృందం నాయకులు ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రం సుధాకర్ రెడ్డి, ఫౌండేషన్ సెక్రెటరీ, మాజీ సర్పంచ్ బండి రఘుపతిని ఘనంగా శాలువాలతో పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఇంచార్జ్ కేశవులు,ఉన్నతి ఫౌండేషన్ కార్యదర్శి బండి రఘుపతి, ఫౌండేషన్ సభ్యులు శ్రీరామ్, రమేష్, నితిన్, మాజీ ఎంపీటీసీలు జి. శ్రీనివాసమూర్తి, అంబాజీ,నాయకులు అంజయ్యగౌడ్,పి అశోక్ బాబు, రాజు, విష్ణు, ఉపాధ్యాయులు శేఖర్, పరమేశ్, ఆదర్శరావు, శ్రీదేవి, పూర్ణిమ, ఆసియా, నాగాజ్యోతి, బాలికల పాఠశాల ఉపాధ్యాయలు శోభ, ఖాజాబీ, శ్రీదేవీ, ప్రసూన, బాలకృష్ణ, వెంకటరమన, పుణ్యవతి, వసుంధర తదితరులు పాల్గొన్నారు.





