– గాజాపై కొనసాగుతున్న దాడులు
గాజా స్ట్రిప్: ఉత్తర, దక్షిణ గాజాలోని పలు నివాసాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22మంది చిన్నారులు సహా 60మంది మరణించారని స్థానిక ఇండోనేషియా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ దాడులు కొనసాగాయి. ఉత్తర గాజాలోని జాబాలియా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 50మంది మరణించగా, ఖాన్ యూనిస్ దక్షిణ ప్రాంతంలో జరిగిన దాడుల్లో మరో పది మంది మరణించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం హమాస్ ఒక ఇజ్రాయిలీ-అమెరికన్ బందీని విడుదల చేసిం ది. దాంతో కాల్పుల విరమణకు కసరత్తు ప్రారంభం కాగలదని భావించారు. కానీ ఆ మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. హమాస్‌ను ఓడించేవరకు తాము దాడులను ఆపేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ దాడిపై స్పందించేందుకు ఇజ్రాయిల్ సైన్యం నిరాకరించింది. రాకెట్ లాంచర్లు సహా ఆ ప్రాంతంలో హమాస్ మౌలిక సదుపాయాలు ఉన్నందున జబాలియా నివాసితులను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం రాత్రి హెచ్చరిక జారీ చేసింది. ఆ వెంటనే దాడులు ప్రారంభించింది.
22మంది చిన్నారులతో సహా 60మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES