Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుగొర్రెల దొంగల వెంటనే పట్టుకోవాలని డీసీపీకి వినతి….

గొర్రెల దొంగల వెంటనే పట్టుకోవాలని డీసీపీకి వినతి….

- Advertisement -


నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గొర్రెల దొంగలను వెంటనే గుర్తించి బాధితులకు భరోసా కల్పించాలని జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ భువనగిరి డిసిపి ఆకాంక్ష్ యాదవ్‌ను కోరారు. మంగళవారం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ వేగవంతం చేసి నిందితులను త్వరగా గుర్తించి చట్ట పరిధిలో కఠినంగా శిక్షించి వృత్తిదారులకు నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గత నాలుగు నెలల కాలంలో జిల్లాలోని భువనగిరి,బీబీనగర్, పోచంపల్లి మండలాలలో జరిగే వరుసగా జరుగుతున్న గొర్రెల దొంగతనాలను చూసి గొల్ల కురుమలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వడపర్తిలో మేడబోయిన బాలయ్య మందలో అక్టోబర్ 28న 50గొర్రెలను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకుపోయారని,గొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధి నీలంబావి,రాయరావుపేట ప్రాంతాలలో సుమారు 47 గొర్రెలు,1పొట్టేలు,3 మేకలు దోపిడీకి గురయ్యాయని ఇట్టి విషయాన్ని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల రోజులు దాటినా ఎటువంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయరావుపేట, వడపర్తిలో జీవాలను ఎత్తుకెళ్ళిన వ్యక్తులు,నాలుగు చక్రాల వాహనం సిసి పుటేజీలో నమోదైన వీడియోలను బాధితులు పోలీసులకు చూపెట్టినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలలో జీవాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని అరికట్టేందుకు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహ్మ, అధ్యక్షులు మద్దెపురం రాజు,ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,సహాయ కార్యదర్శి కొండె శ్రీశైలం,రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లంల సత్యనారాయణ,జిల్లా కమిటీ సభ్యులు క్యాసాని నవీన్,బీమగోని బాలరాజు,నరాముల గణేష్,బుగ్గ లక్ష్మయ్య,బాధితులు మేడబోయిన బాలయ్య,మన్నెబోయిన రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -