- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని వివేకానర్ తండాలో పశువులకు గాలికొంటూ వ్యాధి నివారణకు టీకాలు వేశామని మండల పశువైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. వివేక్ నగర్ తండాలోని 82 ఆవులకు 32 గేదెలకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశమన్నారు. గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య అధికారి రోహిత్ రెడ్డి పరిశీలించి, సిబ్బందికి పలు సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది గోపాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు..
- Advertisement -



