- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్‌కు బయలుదేరారు.భక్తులతో కలిసి కపిల్ దార్‌కు పాదయాత్రగా వెళ్తున్న సద్గురు సోమాయప్పని మార్గమధ్యలో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారితో కలిసి కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కపిల్ దార్‌కు చేరుకొని మన్మథ్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



