నవతెలంగాణ – చారకొండ
వర్షాలకు భారీగా వరద రావడంతో రోడ్డు తెగి రైతులకు, రవాణా దారులకు ఇబ్బందిగా మారిందని జూపల్లి గ్రామ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం భారీ వర్షం రావడంతో జూపల్లి గ్రామం నుండి వంగూరు గేట్ వెళ్లే మట్టి రోడ్డు ట్యాంక్ బాయ్ దగ్గర రోడ్డు తెగిపోవడంతో రైతులు పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేపట్టి, ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఈ సందర్బంగా వారు కోరారు. కాంట్రాక్టర్లు ఈ రోడ్డుకు భూమిపూజ చేసి, మళ్ళీ ఇటువైపు కూడా తిరిగి చూడలేదని అన్నారు. దీనికి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమా.. అధికారుల నిర్లక్ష్యమా అని వారు ప్రశ్నించారు. వెంటనే కల్వకుర్తి, అచ్చంపేట శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించాలని అన్నారు.
జూపల్లి నుంచి వంగూరు గేట్ రోడ్డుకు అంతరాయం
- Advertisement -
- Advertisement -



