కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ, ‘ఈ వేదిక పైన నేను, అన్నయ్య నిలుచుని ఉన్నప్పుడు నాన్న చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు విజయశాంతి మాట్లాడుతుంటే నాన్న లేని లోటు తీరినట్లు అయింది. ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు. 18వ తేదీన మీ అందరి ముందుకు రాబోతుంది ఈ సినిమా. రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు. ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్‌ని నేను ఎగరేస్తున్నాను. ఈ సినిమా కళ్యాణ్ అన్న కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది’ అని అన్నారు.
క్లైమాక్స్‌లో కన్నీటి పర్యంతమవుతారు
- Advertisement -
RELATED ARTICLES