Wednesday, November 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకుప్పకూలిన విమానం.. ముగ్గురి మృతి

కుప్పకూలిన విమానం.. ముగ్గురి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని లూయిస్‌విల్లేలో విమానం కూలిపోయింది. టేకాఫ్‌ సమయంలో యూపీఎస్‌ కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీఎస్‌ ఫ్లైట్‌ నంబర్‌ 2976 విమానం హోనులులుకు సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించింది.

విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసి కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విమానం మెక్‌డోనెల్‌ డగ్లస్‌ ఎండీ-11 రకానికి చెందినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -