- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.5.45ను రూ.6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచారు. 9,10వ తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
- Advertisement -



