నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని మిర్జాపుర్‌లో బుధవారం రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతిచెందినట్లు తెలుస్తోంది. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్రికులు చోపాన్-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో చునార్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం వారు ప్లాట్‌ఫాం వైపు దిగకుండా మరోవైపు ఉన్న పట్టాలపై దిగారు. అక్కడి నుంచి ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాం పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ట్రాక్ పైకి వచ్చిన హౌరా-కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురి మృతి
- Advertisement -
- Advertisement -



