Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయంకార్తీక పౌర్ణ‌మి..వంతెన‌పై భారీగా నిలిచిన వాహ‌నాలు

కార్తీక పౌర్ణ‌మి..వంతెన‌పై భారీగా నిలిచిన వాహ‌నాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ రాజ‌ధాని పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా పాట్నాలోని దిఘా ఎయిమ్స్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫ్లైఓవ‌ర్ తో పాటు వంతెన కింది మార్గంలో కూడా వాహ‌నాల‌తో నిండిపోయింది. దాదాపు ఐదు కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయ్యాయి. దీంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అప్ర‌మ‌త్తమైన ట్రాఫిక్ సిబ్బంది..ట్రాపిక్‌ను క్లియ‌ర్ చేయ‌డానికి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కార్తీక్ పౌర్ణ‌మి సంద‌ర్భంగా తెల్ల‌వారుజాము నుంచి గంగా ఘాట్‌కు భ‌క్తులు పొటెత్తారు. గంగా న‌దిలో పుణ్య స్థానాలు చేయ‌డానికి త‌ర‌లివచ్చిన భ‌క్తుల‌తో ఘాట్ ప‌రిస‌రాలు జ‌న‌సంద్రంగా మారింది. అదే విధంగా గంగా ఘాట్‌కు వ‌చ్చే మార్గాల‌న్ని ర‌ద్దీగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -