- Advertisement -
– పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ దంపతులు
నవతెలంగాణ మోపాల్
కార్తీక పౌర్ణమి సందర్భంగా మోపాల్ మండలంలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నరసింగపల్లిలో పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత శ్రీవారి కల్యాణం జరిపించారు. ఈ కళ్యాణంలో గ్రామ ప్రజలు సినీ నిర్మాత దిల్ రాజు, శిరీష్, ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి హర్షిత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి కూతురు అల్లుడు శ్రీహరి కీర్తన శరత్ లు యజమానులుగా ఉండి శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. వేద పండితులు సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



