వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరం అశోక్..
నవతెలంగాణ జన్నారం
జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకాన్ని అమలు చేయాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం సిఐటియు కార్యాలయం లో మగ్గిడి జయ యి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.
గ్రామీణ ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. కానీ ఈరోజు వరకు ఆ పథకాన్ని అమలు చేయలేదన్నారు. ప్రతి జాబు కార్డుకు 12000 సంవత్సరానికి ఒకసారి ఇస్తా అని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఏ గ్రామంలో జాబ్ కార్డు కలిగిన ఉపాధి కూలీలకు ఇవ్వలేదన్నారు. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండలంలో భర్తలు చనిపోయినటువంటి వితంతువులు 100 మందికి పైగా ఉన్నారు.
వీరందరికీ వితంతు పెన్షన్ లు రాక పది సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు బీడీ కార్మికులు జీవన భృతి కొరకు 2014 కటౌట్ డేటు ఉన్నటువంటి పిఎఫ్ ఉన్నటువంటి వాళ్లు ఉన్నారు.. వీరందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు. మండలంలో ఇటీవల కురిసిన తుఫాను భారీ వర్షాలు కారణంగా రైతులు పత్తి పంట వరి పంట కూరగాయల పంటలు వీటన్నిటికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం కొరకు కార్యక్రమాన్ని రూపొందించుకొని ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. పోరాటం చేస్తామని ఈ కార్యక్రమంలో కోడిపెల్లి అంజన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు.



