కామన్ పల్లి గ్రామం వద్ద చెక్ గేట్ ను ప్రారంభించిన ఎఫ్డీఓ రామ్మోహన్
నవతెలంగాణ జన్నారం
అడవులను కాపాడుకుంటేనే మానవమనగడ సాధ్యమవుతుందని జన్నారం ఎండిఓ రామ్మోహన్ అన్నారు. బుధవారం జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కామన్ పల్లి గ్రామం కడెం ప్రధాన కాలువ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్కు గేటును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవ్వాల్ గ్రామం నుంచి అక్రమ కలప తరలిపోకుండా ఈ చెక్ గేట్ ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కామన్ పల్లి గ్రామ ప్రజలకు అడవుల సంరక్షణ జంతు సంరక్షణ పై అవగాహన కలిగించారు.
అడవులు విరివిగా ఉంటేనే అందులో జంతు జీవరాసులు క్షేమంగా ఉంటాయన్నారు.. అడవులలో వన్య మృగాలు వన్యప్రాణులు జంతువులు ఉంటేనే జీవవైవిద్యం కొనసాగుతుందన్నారు. అడవులు జంతువుల సంరక్షణ అందరి బాధ్యత కావాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ ఆలీ ఖాన్, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మొహమ్మద్ రియాజుద్దీన్ కామన్పల్లి మాజీ సర్పంచ్ పేరం శ్రీనివాస్, దేవుని గూడా మాజీ సర్పంచ్ గవ్వల శ్రీకాంత్, ఇందన్ పల్లి ఎఫ్ఆర్వో లక్ష్మీనారాయణ, జన్నారం ఇన్ చార్జి రేంజ్ అధికారి మమత, భరత్ నాయక్ ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.



