నవతెలంగాణ – భీంగల్
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవం బుధవారం కనులపండువగా సాగింది.లింబాద్రి గుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహ స్వామి వారి దర్శించుకునేందుకు బుధవారం లక్షల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి రథోత్సవ జాతర కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి లు, భక్తులు భారీగా తరలివచ్చారు. భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. బుధవారం లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. జాతరలో భాగంగా బుధవారం రథోత్సవం, రథభ్రమణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బాల్కొండ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జ్ మల్లికార్జున్ రెడ్డి,జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గర్భాలయంలో పూజలు,లింబాద్రిగుట్టలో స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారు స్వయంగా రథాన్ని లాగారు. వారు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని రైతుల పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటూ లింబాద్రిగుట్ట పైన సౌకర్యాల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని లక్షలాదిమంది భక్తులు నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన సత్రంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కన మోహన్, మండల అధ్యక్షుడు అరె రవీందర్,టౌన్ అధ్యక్షుడు కనికరం మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
లింబద్రి గుట్ట రథోత్సవ జాతరకు పోటెత్తిన భక్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



