నవతెలంగాణ-గోవిందరావుపేట
పదే పదే దెబ్బతింటున్న రహదారికి చిన్న కల్వర్ట్ నిర్మించి రహదారి సౌకర్యం కల్పించాలని పసర గ్రామపంచాయతీ రెండవ వార్డు ప్రజలు కోరుతున్నారు. బుధవారం గ్రామ పంచాయతీ పస్రా 2 వా వార్డ్ పరిధిలో మాజీ వార్డ్ మెంబెర్ గొంది గోపి ఇంటికి వెళ్లే దారి సూరారపు రాజు ఇంటి ముందు అటు పక్కన డాంబర్ బిటి రోడ్ ఇటు పక్కన సీసీ రోడ్ ఉన్నా కూడా మధ్యలో వర్షకాలంలో అయినా…కాకున్నా నిరంతరం నీటి ప్రవాహం ఉంది దానికి ఆ నీరు వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న మోరి లేక అటు నుండి వచ్చే స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు… చిన్నావాళ్లకు…. పెద్దవాళ్లకు… వృద్దులకు…. అందులో నుండి రోడ్ దాటి అత్యవసర సమయం లో బురద లో వెళ్ళి రావడం కష్టం గా ఉంది…. దీన్ని గమనించి… పస్రా గ్రామ పంచాయతీ సిబ్బంది తక్షణమే ఒక మోరి వేసి మోరిగుండా నీళ్లు పోయే విధంగా నిర్మాణం చేసి రహదారిని దెబ్బ తినకుండా సౌకర్యవంతంగా కల్పించాలని రెండో వార్డు ప్రజలు కోరుకుంటున్నారు.
మోరి నిర్మించి రహదారి సౌకర్యం కల్పించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



