- – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి: బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని వల్మిడి ముత్తారం గ్రామాల మధ్య బ్రిడ్జి త పాటు రోడ్డు ధ్వంసం కావడంతో మూడు కోట్ల సి ఆర్ ఆర్ నిధులతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బ్రిడ్జి నిర్మాణ పనులకు, ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. బ్రిడ్జి తో పాటు రోడ్డు ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని, రైతులు, విద్యార్థులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. తాత్కాలికంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లన్నింటినీ మరమ్మతులు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జరగాని కుమారస్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ బొమ్మగాని మానస భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్, జిల్లా నాయకులు నలమాస రమేష్ గౌడ్, అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్, మాదాసు హరీష్ గౌడ్, నాయకులు బండి అయోధ్య, పాలకుర్తి సొసైటీ డైరెక్టర్ చిలువేరు వీరయ్య, వల్మిడి గ్రామ పార్టీ అధ్యక్షులు నీరటి చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ బీసు లలిత యాదగిరి, నాయకులు సత్తయ్య, వేణు, శ్రీను, సోమయ్య, సంపత్, పి ఆర్ ఏఈ లు భూక్య శ్రీనివాస్ నాయక్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే గారి వెంట స్పందనకు సంతోషం వ్యక్తం చేస్తూ వర్షాల వల్ల నెలలుగా రోడ్లు పాడైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మా సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్న యశస్విని రెడ్డి గారికి కృతజ్ఞతలు, అని తెలిపారు..
ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో రోడ్ల మరమ్మత్తు పనులు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు తెలిపారు. పనుల నాణ్యతపై క్రమానుగత పర్యవేక్షణ ఉంటుందని, ధ్వంసమైన రహదారుల స్థానంలో కొత్త రహదారులు త్వరలో రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు..
పాలకుర్తి మండలంలో ప్రజల జీవన సౌకర్యాలను మెరుగుపరిచే క్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేపట్టిన ఈ చర్యను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. గ్రామీణ అభివృద్ధికి ఈ రహదారి కీలక పాత్ర పోషించనుంది..



