Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవంగర లయన్స్ క్లబ్ కు ఉత్తమ అవార్డు 

పెద్దవంగర లయన్స్ క్లబ్ కు ఉత్తమ అవార్డు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర: లయన్స్ క్లబ్ సభ్యత్వ నమోదులో మహబూబాబాద్ రీజియన్ పరిధిలో ఎక్కువ మందిని చేర్పించినందుకు గాను పెద్దవంగర లయన్స్ క్లబ్ కు ఉత్తమ అవార్డు లభించింది. మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో రీజియన్ చైర్మన్ దామెర సరేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఆర్య చంద్రశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, చార్టెడ్ ప్రెసిడెంట్ ఏదునూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాపోలు శ్రీనివాస్, సుభాష్ చంద్రబోస్, అమృత రెడ్డి లకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలను విస్తృతం చేసేందుకు సభ్యులను పెద్ద ఎత్తున చేర్పించాలన్నారు. సమాజంలో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులను ప్రోత్సహించి సభ్యత్వం ఇప్పించాలని సూచించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి మాట్లాడుతూ.. ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జోనల్ చైర్మన్ చిదిరాల నవీన్, పూర్వపు జిల్లా గవర్నర్లు లక్ష్మీనరసింహారావు, డాక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -