నవతెలంగాణ-నవీపేట్: మండలంలోని ఫతేనగర్ శివారులో గత నెల 24వ తేదీన పెట్రోల్ పోసి మహిళను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు నిజామాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతిలు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నిజామాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత నెల 24వ తేదీన ఫతేనగర్ శివారు ప్రాంతంలో మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అలియాస్ బుజ్జిని పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులో సీఐ శ్రీనివాస్ ఎస్ఐలు తిరుపతి, యాదగిరి గౌడ్, రాజశేఖర్ లు టీంలుగా ఏర్పడి పరిశోధించగా ఫకీరాబాద్ గ్రామానికి చెందిన గొల్ల సంగీత, బాదావత్ పద్మ మరియు మంగలి బాబు లు ముగ్గురు కలిసి డబ్బుల విషయంలో గత కొన్ని రోజులుగా తగాదాలు ఉండడంతో కల్లు తాగే నిమిత్తం ఫతేనగర్ శివారుకు తీసుకెళ్లి కల్లు తాగించి మద్యం మత్తులో గొంతునులిమి చంపివేసి వారితో తీసుకొచ్చిన పెట్రోల్ తో తగలబెట్టారని బుధవారం ముగ్గురిని అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు చేధనలో కృషి చేసిన పోలీస్ సిబ్బందికి ఏసిపి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
పెట్రోల్ పోసి కాల్చిన మహిళ హత్య నిందితుల అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



