- Advertisement -
నవతెలంగాణ-ఉప్పునుంతల: 108 అంబులెన్స్ లో ఓ గర్భిణీ డెలివరీ అయింది. ఈ సంఘటన ఉప్పునుంతల మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మాపూర్ గ్రామానికి పానుగంటి అనిత నెలలు నిండుకోవడంతో పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో గమనించిన బంధువులు 108కు ఫోన్ చేశారు. సకాలంలో స్పందించిన 108 ఉద్యోగులు ఇఎంటి లక్ష్మణ్, పైలెట్ ఎండి కాజా సదురు మహిళను అంబులెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో పురిణీ నొప్పులు అధికమైయ్యాయి. దీంతో 108 సిబ్బంది.. తెలకపల్లి దగ్గరలో ఇఆర్ సిపి డాక్టర్ మనీష్ సూచనల మేరకు సాధారణ కాన్పు చేశారు. దీంతో సదురు మహిళ పండంటి మగ బిడ్డ జన్మించింది.
- Advertisement -



