Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రంధాలయం గ్రామ యువతకి అంకితం

గ్రంధాలయం గ్రామ యువతకి అంకితం

- Advertisement -

– జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులు
నవతెలంగాణ-కామారెడ్డి : పాల్వంచ మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులు తమ కూతురు హరిక,తండ్రి మహబూబ రెడ్డి ల జ్ఞాపకార్ధం తమ స్వంత నిధులు 20 లక్షలతో అత్యాధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని  నిర్మించారు. బుధవారం గ్రామలోని ఉద్యోగులు, యువత,  గ్రామప్రజల సమక్షంలో  గ్రంధాలయం ను గ్రామానికి అంకితం ఇవ్వడం జరిగినదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ జీడి పల్లి లత నరసింహారెడ్డి దంపతులు తమ స్వంత నిధులతో నిర్మించడం ఆదర్శనీయం అని, గ్రంథాలయ నిర్మాణము చేయడము అంటే గ్రామాన్ని చైతన్యము వైపు పరుగులు పెట్టించడం ఉందని, ఆ కుటుంబానికి గ్రామ ప్రజలు, ఉద్యోగులు, యువత తరపున కృతజ్ఞతలు ,ఈ గ్రామము మీకు ఎల్లవేళల రుణ పడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి, గ్రామస్తులు బట్టెంకి బాలరాజ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -