Thursday, May 15, 2025
Homeజాతీయంయూపీఎస్సీ చైర్మెన్‌గా అజయ్‌ కుమార్‌

యూపీఎస్సీ చైర్మెన్‌గా అజయ్‌ కుమార్‌

- Advertisement -

– కేంద్రం ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) చైర్మెన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ స్థానంలో ప్రీతి సుదాన్‌ చైర్మెన్‌గా ఉండగా ఏప్రిల్‌ 29తో ఆమె పదవీకాలం ముగిసింది. దీంతో అజరు కుమార్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అజరు కుమార్‌ 1985 బ్యాచ్‌ కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 2019 ఆగస్టు 23 నుంచి 2022 అక్టోబర్‌ 31 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా ఆయన విధులు నిర్వహించారు. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ఈ కమిషన్‌లో చైర్మెన్‌ సహా అత్యధికంగా 10 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్సీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్టంగా ఆరేండ్లు లేదా 65 ఏండ్ల వయసు నిండేవరకు కొనసాగవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -