– పడిపూజ భక్తులకు అల్పాహారం దాత బుసిరెడ్డి పాండన్నా
– 4000 లకు పైగా హాజరైన స్వాములు
నవతెలంగాణ-పెద్దవూర: మండలంలోని బట్టుగూడెం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వాములు మహాపడిపూజ మహోత్సవం బుధవారం రాత్రి 12 గంటల వరకు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహా పడి పూజకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహా పడిపూజకు నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి 4000 లకు పైగా అయ్యప్ప, ఆంజనేయ, శివ స్వాములు హాజరై తీర్ధప్రసాదాలు స్వీకరించారు. స్వాములకు భక్తులందరికి, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,మాజీ సర్పంచ్ శంకర్ నాయక్,పూజ నిర్వాహకులు కూన్ రెడ్డి గోవింద్ రెడ్డి,మంద శ్రవణ్ కుమార్,రామారావు తాంత్రిక గురుస్వామి, శ్రీ మండల గోవింద్ గురుస్వామి, మల్లయ్య గురుస్వామి, పేరూల గోవింద్ గురుస్వామి,సంగీత స్వరనిధి నేషనల్ అవార్డు గ్రహీత రాజేష్ గురుస్వామి, ఆలయ పుజారి సూరిబట్ల అనంత శర్మ, గురుస్వామి యదుళ్ళ వెంకటరెడ్డి,రాయప్రొలు మురళి గురుస్వామి,నక్కల రామాంజి రెడ్డి స్వామి,గాలి లింగారెడ్డి స్వామి,భక్తులు తదితరులు పాల్గొన్నారు.



