నవ తెలంగాణ- హైదరాబాద్
నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నామని అపోలో హెల్త్‌కో సీఈఓ మాధివనన్ బాలకృష్ణన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే హెల్త్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. అపోలో హెల్త్‌కో ద్వారా రాబోయే రెండు నెలల్లో 12 బీమా సంస్థల నుంచి బీమా ఉత్పత్తులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొదటి ఏడాదిలో రూ.80 కోట్ల ఆదాయం సాధించాలని నిర్దేశించుకున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గించడం, చెల్లింపుల సౌలభ్యాన్ని పెంచడంలో భాగంగా అపోలో 24/7 దేశంలోనే తొలిసారి ‘హెల్త్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్’ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్డ్ ద్వారా లక్షలాది మంది వినియోగదారులు ఆరోగ్య సేవలు మరింత సులభంగా పొందగలుగుతారని చెప్పారు.
బీమా రంగంలోకి అపోలో 24/7
- Advertisement -
- Advertisement -