నవతెలంగాణ కల్వకుర్తి: పట్టణంలోని బలరాం నగర్ కి చెందిన గోరటి రాధిక అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, కుటుంబం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ ఆర్థిక సాయం గా 5000/- రూపాయలు అందజేశారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మిత్ర ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న “మిత్ర విద్యా భరోసా” కార్యక్రమం ద్వారా రాధిక యొక్క పిల్లల విద్యా భవిష్యత్తుకు సహాయం అందిస్తామని ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ నేత హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రావుఫ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దెవర్ల మహేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



