Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆటోను ఢీ కొట్టిన కారు.. కూలీలకు గాయాలు 

ఆటోను ఢీ కొట్టిన కారు.. కూలీలకు గాయాలు 

- Advertisement -

నవతెలంగాణ-పెబ్బేరు
కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టిన ఘటన గురువారం  జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం కూలీలతో పెబ్బేరు వైపు వెళ్తున్న ఆటోను గద్వాల నుంచి హైదరాబాద్ వెళ్లుతున్న కారు  రంగపూర్ బై పాస్ దగ్గర ఢీకొట్టడంతో 12 మందికి  గాయాలయ్యాయి. వీళ్ళలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్టు తెలిసింది. గాయపడ్డ వారు వనపర్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పార్టీ నాయకులకు ఆస్పత్రి వైద్యులకు గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందాల చూడాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -