Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాగిజావతో...రక్తహీనతకు చెక్.!

రాగిజావతో…రక్తహీనతకు చెక్.!

- Advertisement -

-బడిపిల్లలకు రాగిజావ పంపిణీ
-వారంలో మూడు రోజులు అమలు
నవతెలంగాణ-మల్హర్ రావు

గతంలో అంబలి (రాగిజావ) తాగితే అంబటాల్ల వరకు అన్నం అక్కరలేదు.అప్పటి వరకు ఉదయం తాగిన అంబలి రైతులకు,సాగు, ఇతర పనులు చేసేవారికి ఆకలి వేయకుండ శరీరానికి పోషకాహారం అందించడంతోపాటు చల్లదనాన్ని ఇచ్చే పోషకాహారంగా ఉప యోగపడేది.నేడు టీ,కాఫీల కాలం వచ్చింది.అయినప్పటికీ అంబలిలో ఉన పోషకాహారాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు పోషకాహారాన్ని అందించేందుకు అన్ని పాఠశాలలో గత రెండేళ్ల నుంచి రాగిజావను పంపిణీ చేస్తుంది. దీంతో బడిపిల్లలకు పోషకాహారం అందటంతోపాటు రక్తహీనతకు చెక్ చెబుతుంది.మండలంలో 5 ఉన్నత పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత,28 ప్రాథమిక,ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ  పాఠశాలలతో కలిసి మొత్తం 38 పాఠశాలలు ఉండగా.. 1388 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేస్తుంది.కాగా రెండేళ్ల నుంచి ఉదయం షాట్ ఇంట ర్వెల్కు ముందు రాగిజావను పంపిణీకి శ్రీకారం చుట్టగా ప్రస్తుతం అమలు అవుతుంది.ఈ ఏడాది కాస్త ఆలస్యం అయినప్పటికీ విద్యార్థులకు ప్రభుత్వం రాగిజావను అందచేస్తుంది. దీంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని విద్యార్థులు,ఉపాధ్యాయులు చెబుతున్నారు.
 రాగిపిండి, బెల్లంప్యాకెట్లు పంపిణీ..
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఒక్కో విద్యార్థికి ఒకరోజుకు పది గ్రాముల పిండి, పది గ్రాముల బెల్లం చొప్పున వారంలో మూడు రోజులు అంటే రోజు విడిచి రోజు పంపిణీ చేసే విధంగా రాగి పిండి, బెల్లం ప్యాకెట్లు పంపిణీ చేస్తుంది. దీన్ని మండల విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయం నుంచి ఆయా పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు రాగిజావ తయారు చేసి పిల్లలకు అందిస్తున్నారు.రాగిపిండిలో పోషకాలు ఉండగా.. బెల్లంలో ఐరన్ ఇతర పోషకాలు ఉంటాయి.రాగిజావలో 8 శాతం ప్రొటీన్స్, 70శాతం పిండి పదార్థాలు, 20 శాతం పీచుపదార్థాలు, 2 శాతం మినరల్స్ ఉం టాయి.కాల్షియంతో చిన్నారుల ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. బెల్లం, రాగులతో ఐరన్ శాతం పెరిగి రక్తహీనతను నివారిస్తుంది.రాగిజావాతో వివిధ కారణాల వల్ల ఉదయం ఆహారం తీసుకోకుండా బడికి వచ్చిన పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -