Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కలెక్టరేట్ ముందు నిరసన

పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కలెక్టరేట్ ముందు నిరసన

- Advertisement -

– ఫీజు బకాయిలు వచ్చేవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తాం
– రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలు
నవతెలంగాణ –  కామారెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిష్ లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు టిఎన్ఎస్ఎఫ్  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో ఒకవైపు విద్యార్థులు మరొకవైపు యాజమాన్యాలు, అధ్యాపకులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్ ఫీజుబకాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు పోరు యాత్రలో స్వయంగా పాల్గొని నాటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విద్యారంగ వ్యతిరేక విధానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని, వెంటనే ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకుని పూర్తి ఫీజు బకాయాలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.

వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారికి సంబంధించిన సర్టిఫికెట్లను కళాశాలల నుండి పొందలేకపోతున్నారని యాజమాన్యాలు బకాయిలు వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను ఇస్తామని అంటున్నాయని, దీనివలన ఉన్నత ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోతున్నారని అన్నారు. వేలాదిమంది అధ్యాపకులు వివిధ కళాశాలలో పనిచేస్తున్నారని వారికి వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందుల్లోకి వెళ్లిపోవడం జరిగిందని, ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బకాయిల విడుదల కార్యక్రమాల కోసం కార్యాచరణ ప్రకటించి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. విజిలెన్స్ దాడుల పేరుతో కళాశాలలను బెదిరించడం సరికాదని ఫీజుబకాయలను పూర్తిగా చెల్లించిన తర్వాత ఎలాంటి దాడులు చేసిన విద్యార్థు సంఘం స్వాగతిస్తామని అన్నారు ఫీజుల బకాయిలు అడిగినప్పుడు మాత్రమే విజిలెన్స్ దాడులు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుకు వచ్చాయా మరి రెండు సంవత్సరాల నుండి ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల ద్వంద వైఖరిని మానుకోవాలని లేకపోతే బిఆర్ఎస్  పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ పడుతుందని విషయాన్ని గుర్తుతెరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతె రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు చౌట గణేష్, తోట మనోహర్ పటేల్, జహీరాబాద్ పార్లమెంట్ బాధ్యులు అంజల్ రెడ్డి, సతీష్, రాజు,నవీన్, సందీప్, రమేష్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -