- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(46)కు కొద్దిలో అర్ధశతకం చేజారింది. అభిషేక్ 28, శివమ్ 22, సూర్యకుమార్ 20, తిలక్ 5, జితేశ్ 3, సుందర్ 12, అక్షర్ 21, అర్ష్‌దీప్ 0, వరుణ్ 1 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఎలిస్ 3, జంపా 3, బార్ట్‌లెట్ 1, మార్కస్ 1 వికెట్ తీశారు.
- Advertisement -



