Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంఅనిల్‌ అంబానీకి ఈడీ నోటీసులు

అనిల్‌ అంబానీకి ఈడీ నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది. బ్యాంక్‌ మోసం, మనీలాండరింగ్‌ కేసులకు సంబంధించి వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో అనిల్‌ అంబానీని ఇడి విచారించిన సంగతి తెలిసిందే.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) నుండి వేల కోట్లు అప్పులు తీసుకుని, నిధుల మళ్లింపు, మనీలాండరింగ్‌కి పాల్పడిన కేసులో కార్పోరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును చేపట్టింది. రూ.17,000 కోట్ల బ్యాంక్‌ రుణాల మళ్లింపుపై ఇడి, సిబిఐ, సెబీ దర్యాప్తు చేపడుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇడి ఇప్పటికే రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -