Thursday, November 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మందుబాబులకు బిగ్ షాక్..మద్యం దుకాణాలు బంద్

మందుబాబులకు బిగ్ షాక్..మద్యం దుకాణాలు బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. నవంబర్ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా ఖరీదుగా మారిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తున్నది. అందుకే ఖర్చుకు వెనకాడటం లేదు. పోటీలు పడి మరీ డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసేవరకు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు టాక్. ఈ క్రమంలోనే మద్యం ప్రలోభాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -