- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో రూ.17 లక్షల రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఖైరాగఢ్-చుయిఖాదన్-గండై (కెసిజి) జిల్లాలో గురువారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారని అన్నారు.
కమలా సోది(30) బస్తర్‌లోని మాడ్ డివిజన్‌లో, మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసి)జోన్‌లో నిషేధిత సిపిఐ(మావోయిస్ట్)లో చురుగ్గా పనిచేసేవారని కెసిజి పోలీస్ సూపరింటెండెంట్ వెల్లడించారు. ఆ సంస్థ సైనిక విభాగంలో హార్డ్‌కోర్ సభ్యురాలిగా, ఎంఎంసి జోన్ కమాండర్ రామ్‌దార్ నేతృత్వంలోని బృందంలో భాగంగా ఉన్నారని అన్నారు. ఆమె సుక్మా జిల్లాలోని అర్లాంపల్లి గ్రామానికి చెందినవారు.
- Advertisement -



