Thursday, November 6, 2025
E-PAPER
Homeబీజినెస్భారతదేశం అంతటా 10 సంవత్సరాల పరివర్తనా ప్రభావాన్ని సంబరం చేసిన HCLFoundation

భారతదేశం అంతటా 10 సంవత్సరాల పరివర్తనా ప్రభావాన్ని సంబరం చేసిన HCLFoundation

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారతదేశంలో HCLTech యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత ఎజెండాను ప్రోత్సహిస్తున్న HCLFoundation భారతదేశంలో తమ నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ (NGOలు) ద్వారా వినూత్నమైన గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులను మద్దతు చేస్తున్న తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం, HCLTech Grant యొక్క 10వ వార్షికోత్సవం సంబరం ఈరోజు చేసింది.

2015లో ప్రారంభమైన నాటి నుండి, HCLTech Grant 2.3 మిలియన్ జీవితాలపై సానుకూలమైన ప్రభావం చూపించడానికి ప్రాజెక్టులలో రూ. 169 కోట్లు పెట్టుబడి పెట్టింది. గత 10 ఎడిషన్స్ లో NGOల నుండి 13,000+ ప్రతిపాదనలు మరియు 87,000+ రిజిస్ట్రేషన్స్ లో కార్యక్రమం యొక్క విశ్వశనీయత కనిపించింది. పూర్తి చేయబడిన 49 ప్రాజెక్టులు, 18 యాక్టివ్ ప్రాజెక్టులతో, అట్టడుగు స్థాయిల్లో HCLTech Grant సమీకృక మార్పు కలిగించడాన్ని కొనసాగిస్తోంది మరియు భారతదేశం అభివృద్ధి వ్యవస్థలో అవసరమైన మౌళిక సదుపాయాలు అమలు చేయడం మరియు నమ్మకం కోసం కొత్త ప్రమాణాలను రూపొందిస్తోంది.

గత దశాబ్దంగా, కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించింది:

114 మిలియన్ లీటర్ల నీరు సంరక్షించబడింది
245 జలాశయాలు నిర్మించబడ్డాయి/పునరుత్తేజం చేయబడ్డాయి
కార్బన్ ఉద్గారాల్లో 67,095  టన్నులు తగ్గించబడ్డాయి
2,722 టన్నుల వ్యర్థాలు రీసైకిల్ చేయబడ్డాయి/సుస్థిరమైన యాజమాన్యం కిందకు తీసుకురాబడ్డాయి
1.77 లక్షల చెట్లు నాటబడ్డాయి
0.12 హెక్టార్ల భూ ప్రాంతం శుద్ధి చేయబడింది

కార్యక్రమం యొక్క 11వ ఎడిషన్ తో ప్రారంభిస్తూ, HCLFoundation వార్షిక వ్యయంలో రూ. 24 కోట్లకు 45% పెంపుదలను ప్రకటించింది. సరికొత్త ఎడిషన్ లో నీరు, జీవ వైవిధ్యత, చదువు మరియు ఆరోగ్య సంరక్షణలు ప్రాజెక్ట్ శ్రేణులుగా కలిగి ఉంటుంది. గెలిచిన ప్రతి NGO నాలుగేళ్ల ప్రాజెక్ట్ కోసం రూ. 5 కోట్లు అందుకుంటుంది, ఎనిమిది రన్నర్ అప్ NGOలు రెండేళ్ల ప్రాజెక్ట్ కోసం రూ. 50 లక్షలు అందుకుంటాయి.

“HCLTech Grant మన సమాజంలోని అయిదవ ఎస్టేట్ గా నిలిచిన NGOలకు సాధికారత కల్పించడం ద్వారా సమీకృత పురోగతి నుండి వ్యవస్థలకు పునరుత్తేజం కలిగించడం వరకు అట్టడుగు స్థాయిల్లో విజయవంతంగా మార్పును ప్రోత్సహించింది. ప్రాజెక్టుల ప్రభావాన్ని పెంచడం, అమలు చేయడం, కొత్త ప్రాంతాలకు విస్తరించడం మరియు పరిశోధన మరియు డిజిటల్ పర్యవేక్షణలో పెట్టుబడి పెట్టడం పై ఇప్పుడు మేము దృష్టి కేంద్రీకరించాము. గత దశాబ్దంకి పైగా ఈ వినూత్నమైన కార్యక్రమం యొక్క భాగంగా ఉన్న NGO భాగస్వామ్యులకు మేము మా ఎంతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం,” అని రోషిణి నాడర్ మల్హోత్ర, ఛైర్ పర్శన్, HCLTech అన్నారు.

“NGOలతో శక్తివంతమైన భాగస్వామ్యాలు అర్థవంతమైన పరివర్తనను అందచేయగలవని మేము చూపించాము. నిజమైన ప్రభావం సంఖ్యలు కంటే ఎక్కువగా ఉంటుంది- ఇది పునరుద్ధరించబడిన గౌరవం మరియు మార్పు చెందిన జీవితాల్లో కనిపిస్తుంది,” అని HCLTech and Director of HCLFoundationలో డాక్టర్. నిధి పంధీర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ CSR అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -