- Advertisement -
నవతెలగాణ – హైదరాబాద్ : భారత్, పాక్ మధ్య మే 10న కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్‌లను మే 17 నుంచి నిర్వహించనున్నారు. పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లను డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్, బీసీసీఐకి సూచించాడు. పాక్ మూలాలున్న ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల మీద జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. హంగు, ఆర్భాటాలు లేకుండా మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -