బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, అలాగే మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి సిబ్బందితో కలసి బేగంపేట పోలీస్ స్టేషన్ పరిదిలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల తనిఖీలు భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా శంపల్లి
గ్రామం నార్కెట్ పల్లి మండలం నల్గొండ జిల్లాకు చెందిన మాగి సంపత్ మద్యం సేవించి పట్టుబడ్డాడు. అతడిని గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి స్వాతి గౌడ్ ముందు హాజరుపరచగా విచారణ చేసి నిందుతునికి 3 రోజుల జైలు శిక్ష, రూ. 500/- జరిమానా విధించడం జరిగిందన్నారు. ఎవరైనా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని , మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.


