నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌లోని అవంతిపొరాలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించినట్లు అధికారులు తెలిపారు. గత రెండుగంటలుగా కాల్పులు కొనసాగుతున్నాయని, మరో ఇద్దరు ఉగ్రవాదులు ఈప్రాంతంలో చిక్కుకున్నారని అన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా ఉప జిల్లా అయిన అవంతిపొరాలో నాదర్ మరియు ట్రాల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అన్నారు. 48 గంటల్లో జమ్ముకాశ్మీర్‌లో ఇది రెండవ ఎన్‌కౌంటర్. మంగళవారం షోపియాన్‌లో నిర్వహించిన ఆపరేషన్ కెల్లర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. మొదట కుల్గాంలో ప్రారంభమైన ఆపరేషన్ కెల్లర్ అనంతరం షోపియాన్ అటవీ ప్రాంతానికి చేరుకుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు అధికారులు ఆపరేషన్ కెల్లర్ ప్రారంభించారు.
జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES