- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వందేమాతరం గీతాన్ని ఏకకంఠంతో ఆలపించారు.ఈ సందర్భంగా ఎస్సై వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ — వందేమాతరం గీతం మన దేశ స్వాతంత్ర్య సమరానికి ప్రేరణగా నిలిచిందని, ప్రతి భారతీయుడిలో దేశభక్తి జ్వాలలు రగిలించే గీతమిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పునూతల పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
- Advertisement -



