Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంవీధి కుక్కల బెడదపై ‘సుప్రీం’ కీల‌క ఆదేశం

వీధి కుక్కల బెడదపై ‘సుప్రీం’ కీల‌క ఆదేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వీధి కుక్కల బెడదపై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలు, బస్ స్టేషన్ల దగ్గర వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికార పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, క్రీడా సముదాయాల్లో ఉన్న కుక్కలను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించేందుకు కంచెలు ఉండేలా చూసుకోవాలని జిల్లా న్యాయాధికారులకు స్పష్టం చేసింది. పట్టుకున్న వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలి గానీ.. తిరిగి ఎక్కడ కూడా వదిలిపెట్టొద్దని జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత అధికారులకు ఆదేశించింది. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంగణాల్లో వీధి కుక్కలు లేవని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -