- Advertisement -
నవతెలంగాణ-మిర్యాలగూడ
వందేమాతరం గేయం ఆవిర్భవించి శుక్రవారం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వందేమాతరం గేయాలాపన శుక్రవారం మిర్యాలగూడ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో, కళాశాలలో, అంగన్వాడి కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలలో వందేమాతరం గేయాలాపన ఆలపించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో డి ఏ ఓ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో గేయాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



